టాలీవుడ్లో ప్రస్తుతం అందరిలో ఆసక్తి రేపుతున్న చిత్రం “కింగ్డమ్”. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఈ భారీ యాక్షన్ డ్రామా రిలీజ్‌కు రెడీ అవుతోంది. జూలై 31న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.
తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తమిళ్ వెర్షన్ టీజర్ కోసం తాము ఓ శక్తివంతమైన వాయిస్‌ను కోరుకున్నామని, వెంటనే సూర్య పేరు గుర్తుకు వచ్చిందని తెలిపాడు. అడిగిన వెంటనే సూర్య వెంటనే ఓకే చెప్పారని, ఆ విషయం గుర్తు చేస్తూ విజయ్ ఆయనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు.
తమిళ్ స్టార్ హీరో సూర్య తన గొంతుతో కింగ్డం టీజర్‌కు ప్రాణం పోశారని, అందుకు తన కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నకొద్దీ సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.