తమిళ సినిమా దర్శకుల్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్‌తో చేసిన తాజా సినిమా ‘కూలీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా, ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మాస్ మాస్టర్ లాంటి లోకేష్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని రెడీగా ఉన్నాడు.
ఇప్పటి వరకూ ఈ మూవీ పనులపై దృష్టి పెట్టిన లోకేష్, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా నుంచి గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. తన దృష్టి పూర్తిగా ‘కూలీ’ మూవీ మీదే ఉండాలనే ఉద్దేశంతో పాటు ప్రమోషన్‌లు అయ్యే వరకూ సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ముందే చెప్పాడు. ఇప్పుడు ఆ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కావడంతో ఆయన మళ్లీ సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.
తాజాగా తన కాలేజీ డేస్‌ను గుర్తుచేసుకుంటూ లోకేష్ ఓ ఎమోషనల్ ఫోటోను షేర్ చేశాడు. తన కాలేజీ క్లాస్‌రూమ్‌లో కూర్చొని తీసుకున్న సెల్ఫీని తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. అందులో “ఇక్కడినుంచి నా జర్నీ స్టార్ట్ అయింది” అనే జ్ఞాపకాన్ని ప్రస్తావించాడు. ఈ ఫోటో చూసిన అభిమానులు అతని సినిమా ప్యాషన్ అప్పుడే మొదలైందని చెప్పుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆ ఫోటో కాస్తా ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్టర్‌గా తన మొదటి అడుగు వేసిన స్థలాన్ని మళ్లీ సందర్శించిన లోకేష్, తను ఏ స్థాయికి ఎదిగాడో చూపిస్తూ తన ఫాలోవర్స్‌కు స్పెషల్ మోతివేషన్ ఇచ్చాడు.