విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’ ఈ నెల 31న థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై పాజిటివ్ టాక్‌ను పెంచేశాయి.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాలో కొన్ని సీన్లు, డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నట్లు భావించి సెన్సార్ అధికారులు కొన్ని మార్పులు సూచించారు. దాంతో 2 నిమిషాల 31 సెకన్ల ఫుటేజును ఎడిట్ చేసి, రీప్లేస్ చేసినట్టు తెలుస్తోంది. ఫైనల్‌గా సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలుగా ఫిక్స్ అయింది.
విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మళ్ళీ మాస్ అవతారంలో కనిపించనున్నాడని, అతని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఉత్సాహపరచనున్నాయని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్గా నటిస్తుండగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించగా, నిర్మాతలుగా నాగవంశీ మరియు సాయి సౌజన్య కలిసి పని చేస్తున్నారు.
విజయ్ అభిమానులతో పాటు యాక్షన్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతిని ఇచ్చే అవకాశం ఉంది.