బాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ “వార్ 2″పై సినిమాప్రేమికుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఒకవైపు హృతిక్ రోషన్, మరోవైపు తెలుగు స్టార్ ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేయడం సినిమాకే కాదు, ఇండియన్ సినిమాకే ఓ పెద్ద ఎట్రాక్షన్‌గా మారింది. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే బిగ్ స్క్రీన్‌పై ఓ భారీ విజువల్ ఫీస్ట్ మాదిరిగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ సినిమాను మేకర్స్ చాలా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అందుకే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు టార్గెట్లు కూడా అంతే భారీగా ఉన్నాయని ట్రేడ్ వర్గాల అంచనా. వాస్తవానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ.600 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రావాల్సి ఉంటుందట. అదే రూ.800 కోట్లు మార్క్‌ను దాటితే, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచే అవకాశం ఉంటుందని పరిశ్రమలో చర్చ జరుగుతోంది.
అయితే, ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు ఊహించినట్టు ఉండకపోవచ్చు. కారణం… ఇదే సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “కూలీ” అనే మరో భారీ సినిమా కూడా రిలీజ్ కావడం. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి థియేటర్లలో పోటీ పడితే, కలెక్షన్లపై ప్రభావం పడటం సహజం. అందుకే “వార్ 2” టీమ్ ఇప్పుడు మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే అన్ని విభాగాల్లో కూడా స్ట్రాంగ్ కంటెంట్‌తో ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది.
ఇక జాతీయ స్థాయిలో ఈ చిత్రం తీస్తున్న దూకుడు, రెండు ఇండస్ట్రీల స్టార్ హీరోల కలయిక, యాక్షన్ సన్నివేశాలు… ఇవన్నీ కలిపి ఈ సినిమాను భారీ స్థాయిలో నిలిపే అవకాశాలున్నప్పటికీ, అంతిమంగా కంటెంట్ మైత్రిని బాక్సాఫీస్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మరి ఎన్టీఆర్, హృతిక్ కాంబో పాన్ ఇండియా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.