అయ్యో..విజయ్‌ సినిమాకి కొత్త సమస్య వచ్చిందే..!

విజయ్ దేవరకొండ తాజా సినిమా ‘కింగ్డమ్’ జూలై 31న థియేటర్లకు వస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. సినిమాతో పాటు ఆయన గెటప్ కూడా ఇప్పటికి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది.

ఈ కథలో అన్నదమ్ముల మధ్య ఉన్న భావోద్వేగ సంబంధం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది. రిలీజుకు ముందు ట్రైలర్‌ చూసినవాళ్లు కూడా సినిమాలో ఉండబోయే ఎమోషనల్ కంటెంట్‌పై మంచి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జూలై 30న ప్రీమియర్ షోలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే టికెట్ రేట్ల విషయంలో ఒక చిక్కు తలెత్తింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 31 నుంచి మాత్రమే టికెట్ ధరలు పెంచుకునే అనుమతి ఇచ్చింది. దీంతో జూలై 30న జరిగే ప్రీమియర్ షోలపై పెరిగిన రేట్లు వర్తిస్తాయా లేదా అనే సందేహం ఉందంటున్నారు ట్రేడ్ వర్గాలు. దీనిపై అధికారిక స్పష్టత రాలేదు కానీ సినిమా బిజినెస్‌పై ప్రభావం పడే అవకాశముంది.

ఇక హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సె నటిస్తుండగా, సత్యదేవ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ ‘కింగ్డమ్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే పెరిగింది.

Related Posts

Comments

spot_img

Recent Stories