మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్ దాదాపు పూర్తయ్యి, రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే సినిమా చివరి షెడ్యూల్లో ఓ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఈ పాటకు మంచి క్రేజ్ ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది.
ఈ స్పెషల్ సాంగ్‌లో చిరంజీవి తన స్టైల్‌కు స్పెషల్ అని చెప్పే వింటేజ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో మెప్పించనున్నాడు. గతంలో ఆయన చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అభిమానుల్లో ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. అలాంటి స్టెప్స్‌ను మళ్లీ ఈ పాటలో చూడబోతున్నారని ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ ఖుష్.
ఇదే కాదు, ఈ పాటలో చిరంజీవితో కలిసి బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మౌనీ రాయ్ స్టెప్పులు వేయనుంది. మౌనీ రాయ్ బాటిలోకి రావడంతో పాటకు ఇంకాస్త స్పెషల్ గ్లామర్ టచ్ వచ్చిందని ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్‌కు ఫేమస్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ డాన్స్ మూమెంట్స్ డిజైన్ చేస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే, థియేటర్లలో ఈ పాట రగిలించనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాట మీదే ఇలా హైప్ ఉండగా, మొత్తం సినిమాపై మాత్రం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి మరింత పెరిగిపోయింది.
ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తోంది. సంగీతం అందిస్తోన్న ఎం.ఎం.కీరవాణి బాణీలు కూడా సినిమాకు మరో హైలైట్‌గా నిలవబోతున్నాయి. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను యూవి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.