3బీహెచ్‌ కే ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

హీరో సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం 3 BHK ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కథంతా కుటుంబ సంబంధాలపై మునిగిపోతూ, తండ్రి–కొడుకు మధ్య అనుబంధాన్ని ప్రధానంగా చూపిస్తూ సాగుతుంది.

ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన తండ్రిగా, సిద్ధార్థ్ కొడుకుగా ఉన్న ఈ జంట ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అలాగే దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర జె అచార్ లాంటి నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రత్యేకించి కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీకి వచ్చే సమయం కూడా ఆసన్నమైందట. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 5 నుంచి స్ట్రీమింగ్ కు వస్తుందని ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికీ ఈ విషయంపై అధికారిక సమాచారం మాత్రం వెలువడలేదు. థియేటర్లలో బాగానే ఆడిన ఈ సినిమా, డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఎలా రియాక్షన్ వస్తుందో అని ఇప్పుడు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories