రాజకీయ నాయకులు చాలా మందికి వారి సోషల్ మీడియా పోస్టులు వండి పోస్టు చేయడానికి ప్రత్యేకించిన సహాయకులు ఉంటారు. తమ తమ నాయకుల బుద్ధిని, భావజాలాన్ని బట్టి.. వారే పోస్టులు తయారుచేసి తమ నాయకుడికి చూపించి.. అక్కడితో పోస్టు చేసేస్తారు. చిన్నా పెద్ద నాయకులందరికీ ఇలాగే జరుగుతుంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి కేంద్రీకృత వ్యవస్థల్లో అయితే.. ఏ నాయకుడు ఏ ఊళ్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాలో, ఏ సోషల్ మీడియా హ్యాండిల్ మీద ఏం పోస్టు పెట్టాలో.. సమస్తమూ తాడేపల్లి ప్యాలెస్ లోనే తయారై బట్వాడా అవుతుంటాయి. ఈ క్రమంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.. రాష్ట్రమంతా ఖండన ముండనలకు దిగారు. ఆ సమయంలో ప్రెస్మీట్లకు అవకాశం లేదు. కొందరు నాయకులు ఇంట్లో కూర్చుని ఒక ఖండన వీడియో తయారుచేసి మీడియాకు పంపారు. దాదాపుగా అందరూ కూడా ట్విటర్ ఖాతాల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తూ పోస్టులు పెట్టారు. కాకపోతే నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పెట్టని పోస్టు పార్టీనే నవ్వులపాలు చేసేలా ఉంది.
‘‘లిక్కర్ స్కామ్ అంటారు.. కానీ, ఆధారం లేదు.
డబ్బు సీజ్ కాలేదు
మద్యం లభించలేదు.
చార్జ్ షీట్ లో పేరు లేదు.
ఇంకెక్కడా కుంభకోణం.
కానీ అరెస్టు ఉంది. ఎందుకంటే.. టార్గెట్ జగనన్న, ఈ కుట్రలో మిథున్ అన్నను భాగావాడారు, ఇది స్కామ్ కాదు చంద్రబాబు గారి ప్రతీకార డ్రామా’’ అని అనిల్ కుమార్ యాదవ్ ట్వీట్ చేశారు.
తలాతోకాలేని, లాజిక్ లేని ఇంత సోది పోస్టు మరొకటి లేదని జనం నవ్వుకుంటున్నారు. అప్పటికే రాత్రి అయిపోయేసరికి.. పోస్టులు తయారుచేసే సహాయకుడు అందుబాటులో లేడని.. పాపం అనిల్ కుమార్ యాదవ్ తాను సొంతగా పోస్టు పెట్టుకోవలసి వచ్చిందో ఏమో అని నవ్వుకుంటున్నారు. ఈ మాటల్ని విడివిడిగా గమనిస్తే..
‘లిక్కర్ స్కామ్ లో సమస్త ఆధారాలని చూపించారు.
డబ్బు సీజ్ కాలేదు- అనడం తప్పు.. ఆల్రెడీ 62 కోట్లు సీజ్ చేసినట్టు చార్జిషీట్ లో పేర్కన్నారు.
మద్యం లభించనేలేదు అన్నారు- ఎలా లభిస్తుంది. పనికిరాని మద్యాన్ని పేదలచేత తాగించి వారి ప్రాణాలతో జగన్ ఆడుకున్నారు. మద్యం కంపెనీలనుంచి ముడుపులు తీసుకున్నారు. ఇప్పుడు మద్యం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది’ అని జగన్ అంటున్నారు. అసలు కేసు ఏమిలో కూడా తెలియకుండానే ఇలా పోస్టులు పెడుతున్నారేమో అని నవ్వుకుంటున్నారు. సహాయకుడు లేకుండా రాస్తేమాత్రమే ఇంతస్థాయి చవకబారు పోస్టు
తయారవుతుందని ప్రజలు అంటున్నారు.