పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ చిత్రాల్లో వార్ 2 కూడా ఒకటి. ఈ భారీ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ కీలక పాత్రల్లో నటించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా, యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న కారణంగా కూడా అదనపు హైప్ క్రియేట్ అయింది.
ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ముంబైలో ట్రైలర్ సెన్సార్ పూర్తయిందని సమాచారం. ట్రైలర్ నిడివి సుమారు రెండు నిమిషాలు ముప్పై తొమ్మిది సెకన్లుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ట్రైలర్ రిలీజ్ గురించి సినీ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా వచ్చిన బజ్ ప్రకారం, జూలై 23న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలు కలిసి చేస్తున్న ఈ కాంబినేషన్ మాత్రమే కాకుండా, యాక్షన్ సీన్స్, విజువల్స్ కూడా మరో లెవల్‌లో ఉండబోతున్నాయని అంచనాలు పెరుగుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం అని ట్రేడ్ టాక్.