మాస్ రాజా రవితేజ అభిమానులు ఎదురుచూస్తున్న తాజా సినిమా ‘మాస్ జాతర’పై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న భోగవరపు భాను, పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ కథను మలుస్తున్నాడని సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓటీటీ డీల్ కూడా ఫైనల్ అయిందని తెలిసింది. నాన్-థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు టాక్. సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ సుమారు రూ.20 కోట్లు అని తెలుస్తోంది.
సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా, ఆగస్టు 27న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.