వడ్డే కు ఎందుకింత కడుపుమంట.. ఓవరాక్షన్!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, క్రియాశీల రాజకీయాలనుంచి ఎప్పుడో రిటైర్ అయినటువంటి వడ్డే శోభనాద్రీశ్వర రావుకు ఇప్పుడు అమరావతి రైతులను పరిరక్షించాలని బుద్ధి పుట్టింది. అరచేతితో సూర్యకాంతిని ఆపేస్తానని అనుకునే బాపతు తెలివిమంతులలాగా.. అమరావతి రాజధాని విస్తరణ ప్రయత్నాలు తాను ఆపేపేయ చేయగలనని అనుకుంటున్నాడు. అమాంబాపతు మేధావులను వెంటబెట్టుకుని ఆయన రాజధాని విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాలలో పర్యటించి రైతులు బుర్రల్లోకి విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు తెలియని విషయం ఏంటంటే రాజధాని విస్తరణకు ల్యాండ్ పూలింగ్ విషయంలో ప్రభుత్వమే కాస్త నెమ్మదించింది.  గ్రామ సభలు నిర్వహించే పనిని కాస్త వాయిదా వేయవచ్చునని తొందర ఏమీ లేదని చంద్రబాబు నాయుడు అధికారులను, నాయకులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణం ముమ్మరంగా జరుగుతున్న అమరావతి రాజధాని పనులు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అప్పుడు విస్తరణకు భూ సమీకరణ కోసం వెళితే రైతులు కూడా బాగా సహకరిస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావు తొలినుంచి కూడా జగన్ కంటే ఎక్కువగా అమరావతి రాజధాని ప్రయత్నాల మీద తన కడుపు మంట వెళ్లగక్కుతూనే ఉన్నారు. ప్రస్తుతం నిర్మాణం అవుతున్న రాజధానికి భూసమీకరణ జరిగినప్పుడు కూడా వడ్డే ఇదే విధంగా తన విష ప్రచారం కొనసాగించారు. అయితే రైతులెవ్వరూ ఆయనను ఖాతరు చేయలేదు. ఆయన విషం కక్కిన చోటనే ఇప్పుడు ప్రపంచం తల తిప్పి చూసే స్థాయిలో అద్భుత రాజధాని నగరం రూపుదిద్దుకుంటున్నది.

ఈ నగరానికి కొత్త హంగులు తీసుకురావడానికి అంతర్జాతీయ విమానాశ్రయం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి కొత్తగా భూసమీకరణకు ఆలోచన చేశారు చంద్రబాబు. రైతులందరి నుంచి సానుకూలత వ్యక్తం అవుతున్నప్పటికీ.. ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లుగా వారి బుర్రలను కలుషితం చేయడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక రకాల కుటిల ప్రయత్నాలు సాగించింది.

వైయస్సార్ కాంగ్రెస్ వారి కుటిలత్వానికి తాను కూడా తోడు అన్నట్లుగా.. మేధావుల ముసుగులో వైసీపీ భావజాలం బుర్రలు నిండా దాచుకున్న మనుషుల్ని వెంటబెట్టుకుని వడ్డే శోభనాద్రీశ్వర రావు సమావేశాలు నిర్వహి స్తున్నారు. కొత్తగా భూ సమీకరణ చేయదలుచుకున్న ప్రాంతాలలో తాను స్వయంగా పర్యటించి రైతులతో మాట్లాడుతున్నారు. భూములు ఇవ్వవద్దని చెబుతున్నారు. కానీ వాస్తవంలో.. చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణంలో ఒక దశ వరకు ప్రోగ్రెస్ చూపించిన తర్వాత.. విస్తరణ పనుల కోసం వెళితే, ఆ ప్రాంత రైతులు ఎగబడి తమ భూములను కేటాయిస్తారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. వడ్డే ఎందుకింత కడుపుమంట కక్కుతున్నారు- అనేదే బోధపడ్డం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories