ఓటీటీ డేట్‌ లాక్‌ చేసుకున్న తమ్ముడు!

టాలీవుడ్‌లో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు మీద భారీ అంచనాలు ఉండటమే కాకుండా, టైటిల్ కోసమే ప్రత్యేకంగా ఆసక్తి కనిపించింది. పవన్ కళ్యాణ్‌కు బ్లాక్‌బస్టర్ ఇచ్చిన అదే పేరు కలిగిన ఈ సినిమా పాజిటివ్ బజ్‌తో థియేటర్స్‌కి వచ్చింది. అయితే, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చినా, రివ్యూల పరంగా కూడా మిశ్రమ స్పందననే ఎదుర్కొంది. దీంతో థియేటర్ రన్ పెద్దగా సాగలేదు. ఈ పరిస్థితుల్లో ఓటీటీ రిలీజ్‌కి మారడమే సరైన దిశగా భావిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకుని, ఆగస్ట్ 1న ఈ సినిమాను స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి తేవడానికి ప్లాన్ చేస్తోందట. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఫైనల్ డేట్ ఇదే అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా వర్ష బొల్లమ్మ మరియు సప్తమి గౌడ నటించగా, సీనియర్ నటి లయ ఈ సినిమాతో మళ్లీ తెరపైకి వచ్చారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ బాధ్యతలు దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ కలిసి చేపట్టారు.

క్లాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేసిన ఈ సినిమా కథలో కొంత నేటివిటీ ఉన్నా, భావోద్వేగాలు ఆశించినంతగా కనెక్ట్ కాలేకపోయాయి. అందుకే ప్రేక్షకుల్లో సినిమాపై హైప్ ఉన్నప్పటికీ, కలెక్షన్స్ పరంగా వెనుకబడ్డిందనే చెప్పాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories