సెన్సార్‌ పూర్తి చేసుకున్న పవన్‌ మూవీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ హిస్టారికల్ సినిమా హరిహర వీరమల్లు ప్రస్తుతం విడుదల దశలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందించగా, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌ మొదలుకుని సినిమా టీజర్, పోస్టర్లు, సాంగ్స్ వరకూ అన్నీ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ అందులోని యాక్షన్ సీన్లు, విజువల్స్, కథ – అన్నీ ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాస్ లుక్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటాయని చెబుతున్నారు.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా విజువల్‌గానూ, టెక్నికల్‌గానూ ఎంతో గ్రాండ్గా రూపొందించబడింది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, జూలై 24న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు పూర్తి చేశారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇది ఓ ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందన్న అంచనాలు ఏర్పడిన వేళ, ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories