టాలీవుడ్లో ఓ సమయంలో వరుసగా హిట్స్ ఇచ్చిన పూజా హెగ్డే, ఆ తర్వాత బాలీవుడ్ అవకాశాలతో బిజీ అయింది. ఈ కారణంగా తెలుగులో సినిమాలు తగ్గించేసింది. కానీ ఇప్పుడు ఆమె మళ్లీ టాలీవుడ్ వైపు మళ్లినట్టు సమాచారం.
ఇటీవల రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ సినిమాలో పూజా నటించిన స్పెషల్ సాంగ్ ‘మోనిక’కి భారీ స్పందన వచ్చింది. ఈ పాటతో ఆమె తిరిగి ఫుల్ ఫామ్‌లోకి వచ్చినట్టు ఫీలయ్యేలా ఉంది.
ఇప్పుడు పూజా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్‌తో ఆమె జత కట్టనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి తన SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మించనున్నాడు.
ఇద్దరూ తొలిసారి స్క్రీన్‌ను షేర్ చేయనుండటంతో ఈ కాంబినేషన్‌పై మంచి ఆసక్తి నెలకొంది. ఇంకా సినిమా గురించి పూర్తి వివరాలు బయటకు రాలేదు కానీ, పూజా చాలా కాలం తర్వాత టాలీవుడ్ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పడంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
ప్రేక్షకులు ఆమె నుంచి మళ్లీ మంచి ఎంటర్టైన్మెంట్ను ఆశిస్తూ ఎదురుచూస్తున్నారు.