వార్‌ 2 వీటి పై స్పెషల్‌ కేర్‌!

పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ స్టైల్ ఐకాన్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా వార్ 2 పై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండటంతో పాటు, యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీగా నిర్మిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజవగా, అందులో హృతిక్ స్టైల్ మరియు ఎన్టీఆర్ పవర్‌ఫుల్ లుక్ చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే టీజర్ వచ్చిన తర్వాత నుంచి అందరూ మిగతా ప్రమోషనల్ మెటీరియల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే చర్చ సోషల్ మీడియాలో బాగా నడుస్తోంది.

ఇక ఈ ట్రైలర్ విషయంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ హల్ చల్ చేస్తోంది. దీన ప్రకారం ట్రైలర్ కంటెంట్, విజువల్స్ విషయంలో అయాన్ ముఖర్జీ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. టీజర్ వచ్చినప్పుడు కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్‌పై నెగెటివ్ కామెంట్స్ వచ్చాయని, అందుకే ఇప్పుడు ట్రైలర్‌ని మునుపటికంటే నేచురల్‌గా ఉండేలా తీర్చిదిద్దేందుకు స్పెషల్ టీమ్ పని చేస్తోందట.

ఇక ఈసారి ఎన్టీఆర్ పాత్రకు ఎక్కువ బలమైన ఎలివేషన్లు ఉండేలా చూసుకుంటున్నారని బజ్. బాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్టీఆర్ మాస్ యాక్షన్ లుక్ కొత్తగా అనిపించనుండగా, సౌత్ ఆడియెన్స్ మాత్రం అతడి స్టైల్‌ను మరోసారి థియేటర్‌లో చూడాలని ఎదురుచూస్తున్నారు.

ఇప్పటివరకు ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, నిర్మాణ బృందం దానిని ఒక ప్రత్యేక సందర్భానికి ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. మరి ఈ భారీ మల్టీ స్టారర్ మూవీని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories