పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు సినిమాపై మరోసారి హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి సంబంధించి చాలా కాలంగా ఎలాంటి క్లారిటీ లేకపోయినా, ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా మీద మళ్లీ ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కొంత వరకు తెరకెక్కించగా, మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ తీసుకురావడం తెలిసిందే. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటి వరకూ రిలీజ్ కి సంబంధించి స్పష్టత రాకపోయినా, సినిమా బిజినెస్ పరంగా మాత్రం మంచి స్పీడ్ అందుకుంది.
ఇతీవల సీడెడ్ రీజియన్ నుంచి ఈ సినిమా దాదాపు 23 కోట్లకుపైగా డీల్ కుదిరినట్టు సమాచారం. ఇది పవన్ కళ్యాణ్ మార్కెట్‌ను బట్టి చూస్తే పెద్ద మొత్తమే. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని స్టార్ హీరోల సినిమాలతో పోల్చుకుంటే, హరిహర వీరమల్లుకి ఈ స్థాయిలో డిమాండ్ ఉండటం ఓ విశేషమే.
ఇక సినిమా విడుదలయ్యే సమయానికి ట్రైలర్‌తో వచ్చిన అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ స్థాయి బిజినెస్ చేసిన సినిమా తుది రిజల్ట్ ఎలా ఉంటుందో, బాక్సాఫీస్ దగ్గర అదే స్థాయిలో కలెక్షన్లు వస్తాయా అనే ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరినీ ఆసక్తిగా ఉంచుతోంది.
తాజా ట్రెండ్ చూస్తే, ఈ చిత్రం విడుదలైన తర్వాత భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాల్సిందే.