కె-ర్యాంప్‌ గ్లింప్స్‌ ఎప్పుడంటే!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “కె-ర్యాంప్” ప్రస్తుతం మంచి హైప్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. దాన్ని దర్శకుడు జెయిన్స్ నాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే టైటిల్‌తోనే క్యూరియాసిటీ పెరిగిందంటే, ఇప్పుడు మేకర్స్ విడుదల చేసిన తాజా అప్డేట్ మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను జూలై 14న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఒక వీడియో ద్వారా ఈ డేట్‌ను కన్ఫర్మ్ చేయడంతో, సినిమా ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. మొదటి నుంచీ కిరణ్ అబ్బవరం సినిమాల్లోని యూత్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాంటి బలమైన రొమాంటిక్ బ్యాక్‌డ్రాప్‌లో “కె-ర్యాంప్” సినిమా వస్తుండటంతో, అభిమానులు కూడా దీన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదలైన గ్లింప్స్‌తో ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉందో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories