పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న భారీ హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి మొదటి నుంచి కూడా ఎంతో హైప్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని తెలిసినప్పటి నుంచే అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జూలై 24న హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని సమాచారం.
ఇక ఈ సినిమాపై కేవలం ఇండియా మాత్రమే కాదు, ఓవర్సీస్‌లో కూడా విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. అక్కడ జూలై 23న ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. ఇదే నేపథ్యంలో యూఎస్ బాక్సాఫీస్ వద్ద టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. అభిమానులు ఈ సినిమాను మొదటి రోజు ఫస్ట్ షోలోనే చూసేయాలనే ఉత్సాహంతో అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ రెస్పాన్స్ ఇస్తున్నారు.
అందరి చూపు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉండటంతో, విడుదల రోజున దుమ్ముదులిపే కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కథ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యోధుడిగా, రాచరిక వ్యవస్థను ఢీకొంటూ సాగే పాత్రలో కనిపించనున్నాడు.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఒక కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరించారు.
ఇప్పటికే రిలీజైన టీజర్‌లు, పోస్టర్‌లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఫైనల్‌గా జూలై 24న థియేటర్లలో ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించబోతుందో చూడాలి.