వార్‌ 2 గురించిఆ ముద్దుగుమ్మ ఫుల్‌ ఎగ్జైటెడ్‌!

ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యంత భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం “వార్ 2”. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కలిసి నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై బోలెడు హైప్ నెలకొంది. బ్రహ్మాస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైనట్టు తెలుస్తోంది.

ఇక హృతిక్ రోషన్ షూటింగ్ ముగిసిన తర్వాత తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో పని చేయడం ఎంత ప్రత్యేకంగా అనిపించిందో తన పోస్ట్ లో వెల్లడించాడు. హృతిక్ పంచుకున్న అనుభూతులపై ఇప్పటికే అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

తాజాగా కియారా అద్వానీ కూడా ఈ సినిమా గురించి స్పందించింది. హృతిక్ రోషన్‌తో కలిసి పని చేసిన అనుభవం తనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉందని చెప్పింది. అలాగే ఈ చిత్ర దర్శకుడు అయాన్ పనితనాన్ని ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. తాను చేసిన పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉందని, వరల్డ్ క్లాస్ టీమ్‌తో పనిచేయడం ఓ పెద్ద అనుభవంగా భావిస్తున్నానని తెలిపింది.

ఎన్టీఆర్, హృతిక్, కియారా, అయాన్ వంటి స్టార్స్ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. తాజాగా పూర్తి అయిన షూటింగ్, నటీనటుల ఎమోషనల్ పోస్టులు సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories