వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతటి దుర్మార్గమైన మనస్తత్వంతో వ్యవహరిస్తారంటే.. తన సొంత చెల్లెలితో ఆస్తుల గురించి తగాదా పెట్టుకుని, ఆ చెల్లెలి గురించి అసభ్యమైన రాతలు తన వందిమాగధులతో సోషల్ మీడియాలో పోస్టు చేయిస్తారు. తన సొంత చెల్లెలి కేరక్టర్ అసాసినేషన్ చేస్తూ.. తప్పుడు పోస్లులు పెట్టేవారి మీద తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారిని ప్రోత్సాహించిన వ్యక్తి బహుశా జగన్ ఒక్కరే ఉంటారు. తన సొంత చెల్లెలి గురించి, ఆమె కేరక్టర్ గురించి అత్యంత అసహ్యమైన పోస్టులు పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లి గురించి కూడా సోషల్ మీడియాలో అసభ్యపు రాతలు రాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా? అనే సామెత చందంగా.. జగన్ ఎలాంటి అసభ్యపు తప్పుడు పనులు చేస్తుంటారో.. ఆయన అనుచర గణాలు కూడా అదే దుర్మార్గానికి పాల్పడుతున్నాయి. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యవహారం చూసిన ప్రతి ఒక్కరూ అదే అనుకుంటున్నారు.
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనలోని నీచమైన బుద్ధిని బయటపెట్టేలా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఆయనకు ప్రశాంతిరెడ్డి వరుసకు చెల్లెలు అవుతారు. అలా చెల్లెలు వరుస అయ్యే మహిళ మీద, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అయితే ఇలాంటి నీచత్వానికి పాల్పడే ధైర్యం ప్రసన్నకు ఎలా వచ్చింది.. అనే ప్రశ్నకు ప్రజలు సమాధానం సరిగ్గానే ఊహిస్తున్నారు. ఆ పార్టీ నాయకుడే అలాంటి వ్యక్తి కావడం వలన.. అనుచరులు కూడా అదే నీచత్వానికి దిగుతున్నారనేది వారి విశ్లేషణ. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద పార్టీ పరంగా చర్య తీసుకోకపోతే.. జగన్మోహన్ రెడ్డికి పరువు తక్కువ అవుతుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. లేదా, తెలుగుదేశం పార్టీలోని మహిళల గురించి ఇలాంటి నీచపు కూతలు కూస్తున్న తన అనుచరుల్ని చూసి.. జగన్మోహన్ రెడ్డి తన మనసులో లోలోన పండగ చేసుకుంటున్నారేమోనని అందరూ భావించాల్సి వస్తోంది.
మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం అనే విషయంలో జగన్ కు అత్యంత ప్రీతిపాత్రుడైన దువ్వాడ శ్రీనివాస్ కూడా చాలా లేకిగా వ్యవహరించారు. ఆయన తన భార్య గురించి చాలా చులకనగా మాట్లాడుతూ.. పార్టీ పరవు బజారుకీడ్చారు. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ ను మాత్రం పార్టీనుంచి సస్పెండ్ చేశారు. అక్కడ దువ్వాడ భార్య కూడా వైసీపీ నాయకురాలు గనుక, అతని మీద చర్య తీసుకున్నారు. అంతకంటె నీచమైన కామెంట్లు తెలుగుదేశం ఎమ్మెల్యే గురించి చేసినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద చర్యలు తీసుకోకపోతే.. జగన్ ను కూడా ప్రజలు అసహ్యించుకుంటారని అంతా అనుకుంటున్నారు.