యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం సినిమాల మీద దృష్టి పెట్టి ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల తన సొంత బ్యానర్ అయిన ‘క ప్రొడక్షన్స్’ నుంచి వచ్చిన ‘క’ అనే సినిమా మంచి విజయం సాధించింది. ఆ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన కిరణ్, ఇప్పుడు తన అంచనాలు మరింత పెంచేలా ముందుకు సాగుతున్నాడు.
తనపై అభిమానులు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతగా, ఇండస్ట్రీకి కొత్తవారిని పరిచయం చేయాలని కిరణ్ అబ్బవరం నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాతో కొత్త ట్యాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఇదే విషయాన్ని కిరణ్ ఓ స్పెషల్ అప్డేట్ రూపంలో అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
తాజాగా అతను చెప్పిన ప్రకారం, తన తదుపరి ప్రాజెక్ట్‌ను జూలై 10న అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ అనౌన్స్‌మెంట్ జూలై 9 సాయంత్రం 5.01 గంటలకు రాబోతుందని వెల్లడించాడు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది.
ఇక ప్రస్తుతం కిరణ్ చెన్నై లవ్ స్టోరీ, కె-ర్యాంప్ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు తన సొంత బ్యానర్ నుంచి కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతుండటంతో, ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమవుతోంది. మరి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎలాంటి కొత్త టాలెంట్‌ను అందిస్తున్నాడో చూడాల్సిందే.