తీర్పు చిన్నదే.. సంకేతం పెద్దది: బయటకు రావడం కష్టం!

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో తాజాగా సోమవారం నాడు ఒక తీర్పు వెలువడింది. మిగిలిన వాటితో పోల్చినప్పుడు.. నిజానికి ఇది చాలా చిన్న తీర్పు. కానీ ఈ కుంభకోణంలో పాత్రధారులైన నిందితులకు సంబంధించి ఈ తీర్పు ఇస్తున్న సంకేతం చాలా పెద్దది అని పలువురు భావిస్తున్నారు. మద్యం కుంభకోణంలో ఏ 1 నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ప్రధాన అనుచరుడు చాణక్య. లిక్కర్ కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నడిపించడంలో రాజ్ కేసిరెడ్డి తో సమానంగా కీలకంగా వ్యవహరించాడు. ఇతడిని ఏ8 గా కేసులో చేర్చగా ప్రస్తుతం అతను విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తాజాగా అతని బెయిలు పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది.

ఇది ఒక్కరి బెయిలుకు సంబంధించిన పిటిషన్ గానీ.. లిక్కర్ స్కాం నిందితులు ఏ ఒక్కరు కూడా అంత తొందరగా బయటకు రాలేరని చెబుతున్న సంకేతం అని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఈ కుంభకోణంలో ఇప్పటికే అనేక మంది బెయిలు పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. చాణక్య కేవలం రాక్ కేసిరెడ్డి ఆదేశాలకు అనుగుణంగా వసూళ్లు నడిపిస్తూ ఉండేవాడనేది కేసు. కేసులో మిగిలిన చాలామంది పెద్దలు.. ఇంతకంటే చాలా పెద్ద స్థాయిలో స్కాంలో పాత్ర పోషించిన వారే. చాణక్య కే బెయిల్ రాలేదంటే వారెవరికీ అంత సులువుగా రాదనే అర్ధం అని పలువురు వాదిస్తున్నారు. కొత్తగా జైలులో జత కలిసిన చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా పలు దఫాలుగా బెయిలు పిటిషన్ వేయాల్సి ఉంది. అయినా ఫలితం మాత్రం ఉండదని అనడానికి ఈ తీర్పు నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories