చిత్తూరు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. తోతపురి మామిడి రైతులను పరామర్శిస్తారు.. అనే సాకు చూపించి.. బంగారుపాలెంలో జగన్ మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. కానీ.. జగన్ అక్కడకు వచ్చి పార్టీ తరఫున రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించబోతున్నారని వారు రైతులను మభ్యపెడుతున్నారు. కాబట్టి రైతులు అందరూ జగన్ పర్యటనకు ఇతోధికంగా హాజరు కావాలని నాయకులు రైతులకు ఆశ చూపిస్తున్నారు.
జగన్ పర్యటనలకు జనాన్ని పోగేయడం స్థానిక నాయకులకు తలకు మించిన భారం అవుతోంది. అందుకే రైతులకు కిరాయి డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు నేతలు కొత్త ఎత్తుగడ వేసారు. జగన్ మామిడి రైతులకు పార్టీ తరఫున భారీ సాయం ప్రకటిస్తారు అని చెబుతున్నారు. జగన్ పర్యటనకు వచ్చిన వాళ్లకు మాత్రమే ఈ సాయం అందు అందుతుందని అంటున్నారు.
మామిడి మార్కెట్ కు జగన్ రాకకోసం రైతులందరూ ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పడం గమనార్హం. రైతులు జగన్ మీద కోటి ఆశలతో ఉన్నారన్నట్టుగా పెద్దిరెడ్డి చెప్పడం గమనార్హం.
జగన్ మీద రైతులు ఆశలు పెట్టుకోవటానికి రీజన్ ఏముంది. ఆయనతో మొర పెట్టుకుంటే ఒరిగేది ఏమీ లేదని వారికి తెలుసు. అందుకే వారు విముఖంగా ఉంటారని.. నాయకులు డైరెక్ట్ గా జగన్ నుంచి సాయం అందుతుందని మోసపూరిత మాటలతో రైతులను కార్యక్రమానికి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారు.