కన్నడ సినిమాల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంతార చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి ప్రభావం చూపిందో తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అతను రూపొందించిన అద్భుతమైన నాటురల్ బేస్డ్ కథనం, నేపథ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ విజయాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రీక్వెల్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అయితే జూలై 7న రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఆయన యుద్ధవీరుడిగా కనిపిస్తున్నాడు. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో కవచం పట్టుకుని సిద్ధంగా ఉన్న తీరు పోస్టర్‌ను చూడగానే ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పాత్ర కోసం రిషబ్ శెట్టి పూర్తిగా శారీరకంగా, మానసికంగా తన్ను తాను మార్చుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ సినిమాలో కూడా కాంతార స్టైల్‌ను కొనసాగిస్తూ, మరింత డీప్‌గా కథను తీసుకెళ్లేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఎమోషన్, ఆధ్యాత్మికత, యాక్షన్ మిక్స్‌తో ప్యాన్ ఇండియా ప్రేక్షకులను కదిలించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అజనీష్ లోక్‌నాథ్ మరోసారి పని చేస్తున్నారు. ఆయన అందించిన మ్యూజిక్ ఇప్పటికే కాంతారలో ఎంత గట్టిగా పని చేసిందో గుర్తుండే ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్టును హొంబాలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఇదంతా చూస్తుంటే రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’తో మరొసారి దేశవ్యాప్తంగా ఒక పెద్ద ప్రభంజనాన్ని లేచ్చేందుకు రెడీగా ఉన్నట్టు స్పష్టమవుతోంది.