మాధవ్ చుట్టూ ఆశావహులు.. చంద్రబాబుపై ఒత్తిడి!

విశాఖపట్టణం నగరాన్ని గమనిస్తే.. ఒక నెలకిందట.. కొత్తరంగులు దిద్దుకోవడం ప్రారంభించింది. నగరంలోని గోడలన్నీ యోగమయం అయ్యాయి. 21వ తేదీనాటికి ఎటుచూసినా యోగాంధ్రనే కనిపించింది. యోగా అంటేనే విశాఖ.. విశాఖ అంటేనే యోగ అన్నట్టుగా తయారైంది. సరిగ్గా ప్రధాని పర్యటనకు కొన్ని రోజుల ముందునుంచి నరేంద్రమోడీ పోస్టర్లు వెలిశాయి. విశాఖ మొత్తం నరేంద్రమోడీ మయం అయిపోయింది. తీరా ఇప్పుడు కొన్ని రోజులుగా మొత్తం నగరం.. మాధవ్ మయంగా ఉంది. విశాఖనగరం మాధవ్ ను ఫ్లెక్సిల రూపంలో ఒళ్లంతా ధరించినట్టుగా ఉంది. ఎటు చూసినా మాధవ్ కు శుభాకాంక్ష్లలు చెప్పే ఫ్లెక్సిలే. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా మాధవ్ ఎన్నికైన తర్వాత.. విశాఖలో మొత్తం కాషాయమయంగా కనిపిస్తోంది.

బహుశా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో ఎన్నికైన ఏ  ఒక్కరికీ కూడా.. ఈ స్థాయిలో వైభవమైన గ్రీటింగ్స్ దక్కి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎన్డీయేకూటమి అధికారంలో ఉండడం.. అందులో రాష్ట్రంలోనూ బిజెపి కీలక భాగస్వామిగా ఉండడం.. రాష్ట్రంలోనామినేటెడ్ పోస్టుల పందేరం ఇంకా బోలెడు పెండింగులో ఉండడం.. త్వరలోనే నిర్ణయాలు వస్తాయని సంకేతాలు వస్తుండడం తదితర అంశాల నేపథ్యంలో.. బిజెపిలో ఆశావహులు చాలామంది తయారవుతున్నారు. వీరందరూ కూడా.. మాధవ్ చుట్టూ తిరుగుతున్నారు.

అదే సమయంలో  మాధవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కొందరు బిజెపి నాయకులు.. ఎప్పటికీ 5 శాతం పార్టీ గా ఉండిపోవడం అంటే కుదరదు.. తమ బలం పెరిగింది.. వాటా కూడా పెరగాలి.. అంటూ కూటమి ఐక్యతను దెబ్బతీసేవిధంగా వంకర మాటలతో కార్యకర్తలను రెచ్చగొట్టారు. దానికి తగ్గట్టుగానే మాధవ్ మీద పదవుల కోసం ఒత్తిడి పెరుగుతోంది.

ఈ ఒత్తిడి అల్టిమేట్ గా చంద్రబాబు మీదికి చేరుతోంది. చంద్రబాబునాయుడు.. టీటీడీ మినహా రాష్ట్రంలో మరే ఇతర ఆలయ ట్రస్టుబోర్డులను కూడా ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. వందల నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు మాధవ్ చుట్టూ ఆశావహులు పెరగడంతో.. ఆ పోస్టుల ప్రకటనకు ఒత్తిడి పెరుగుతోంది.
వీలైనంత తొందరగా కసరత్తు పూర్తిచేసి అన్ని  ఆలయాల నామినేటెడ్ పాలకవర్గాలను ప్రకటించేయాలని.. ఎంత ఆలస్యం అయితే అంతగా ఒత్తిడి పె రుగుతూ ఉంటుందని చంద్రబాబు కూడా భావిస్తున్నట్టు సమాచారం. ఆలయ మండళ్లకు సంబంధించి సొంత పార్టీ ఎమ్మెల్యేలే పలువురు ఇంకా సిపారసు ప్రతిపాదనలు ఇవ్వలేదని.. వారినుంచి వెంటనే తెప్పించుకుని మొత్తం జాబితాలు ప్రకటించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories