మరొక అల్లరి చేయడమే జగన్ లక్ష్యం!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులను పరామర్శించడానికి బంగారుపాళ్యం యాత్ర పెట్టుకున్నారు. బెంగుళూరు నుంచి రోడ్డు మార్గంలో వచ్చి బంగారుపాళ్యంలోని మామిడి రైతులతో ఆయన మాట్లాడతారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజల మీద ఈ మాత్రం శ్రద్ధ  చూపించడం మంచిదే. అధికారం కోల్పోయి ఏడాది అవుతుండగా.. ప్రజల సమస్యల మీద ఇప్పటిదాకా రెండు మూడు సందర్భాల్లో తప్ప ప్రజల్లోకి వెళ్లి మాట్లాడి ఎరగని ఈ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి రావాలనుకోవడం బాగానే ఉంది. ప్రతిపక్ష నాయకుడు ఆ మాత్రం బాధ్యతగా ఉంటే రాష్ట్రానికి మంచిదే. కానీ.. జగన్మోహన్ రెడ్డి తీరు గమనిస్తే.. ఆయన మామిడి రైతులకు మంచి చేయడం కోసం అక్కడకు వెళుతున్నట్టుగా లేదు. తనకు అలవాటైన రీతిలో మరొక కొత్త ప్రాంతంలో అల్లర్లు సృష్టించడానికి, కొత్తగా తమ పార్టీ వారి మీద కేసులు పెట్టించడానికి, అతి చేయడానికి మాత్రమే ఆయన ప్లాన్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది.

జగన్ తన బెంగుళూరు ప్యాలెస్ నుంచి రోడ్డు మార్గంలో బంగారుపాళ్యం వచ్చి అక్కడి రైతులతో మాట్లాడాలనేది వారి ప్లాన్. పోలీసులకు ఇచ్చిన ప్లాన్ మేరకు జగన్ కేవలం రైతులకోసం మాత్రమే వస్తున్నారా? అలా వచ్చి కావలిస్తే వారితో ఒక రోజంతా గడిపి వారి కష్టాలు ఏమిటో తెలుసుకున్నా పరవాలేదు. వారి కష్టాలు తీర్చడానికి తాను స్వయంగా పల్ప్ ఫ్యాక్టరీలు అన్నింటికీ అందరి యాజమాన్యాలతోనూ తాను స్వయంగా చర్చలు జరిపినా కూడా పరవాలేదు. కానీ అలాంటి పనేమీ చేయకుండా.. జగన్ రైతులతో కాసేపు గడిపి వెళ్లిపోనున్నారు.

నిజానికి ఆయనకు రైతుల కష్టాలు ప్రయారిటీ కాదు అని.. ఆ మిషమీద చిత్తూరు జిల్లాలో కూడా కొంత అల్లర్లు సృష్టించి వెళ్లడం మాత్రమేనని విమర్శలు వస్తున్నాయి. జగన్ కు అంతకు మించి ఇంకొక ధ్యాస ఉండడం లేదు. మొన్నటికి మొన్న రెంటపాళ్ల యాత్ర పెట్టుకుని.. పరామర్శ అని పేరు పెట్టి.. ఏ రీతిగా రెండు ప్రాణాలను బలితీసుకున్నారో అందరూ చూశారు. ఇరవై లక్షల రూపాయలు విదిలించి.. అక్కడితో తన పాపాలు కడిగేసుకున్నట్టే భావించి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఒక రభస చేయాలనుకుంటున్నారు.

రోడ్డు మార్గంలో వెళ్లనున్న జగన్ బంగారుపాళేనికి పరిమితమైతే పరవాలేదు. దారి పొడవునా తన పార్టీ వారితో వేల మంది జనాన్ని పోగేయించి.. వారికి కరచాలనాలు ఇచ్చే మిషమీద.. వారిని తన కారు కింద తొక్కించి చంపుతానని, ప్రభుత్వం తనకు భద్రత లేకుండా చేస్తున్నదని గోల చేస్తానని కుట్రలు పన్నితే మాత్రం కుదరదని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories