నిరుద్యోగ యువతరానికి గొప్ప శుభవార్త

 విద్యాశాఖ మంత్రి లోకేష్ నిరుద్యోగ యువతరానికి అతి గొప్ప శుభవార్తను వెల్లడించారు, ఈ ఐదేళ్ల పదవీకాలంలో  ఏకంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా నిర్దేశించుకుని..  అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చేపట్టబోయే నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని నియోజకవర్గాలలోనూ ఉద్యోగ మేళాలు నిర్వహించాలని నారా లోకేష్ అధికారులకు నిర్దేశించారు. అలాగే జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాలపై కార్యాచరణ కూడా సిద్ధం చేయాలని సూచించారు. 

రాష్ట్రానికి వివిధ సంస్థలను తీసుకురావడం,  యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం పై కూటమి ప్రభుత్వం గరిష్టంగా దృష్టి పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఐదేళ్ల పదవీకాలంలో, తాము మాట ఇచ్చిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల హామీ ప్రకారం మెగాడీఎస్సీ నిర్వహణ ఇప్పటికే పూర్తయింది. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు నాటికి నియామక పత్రాలు అందుతాయని లోకేష్ అంటున్నా.రు 16 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ అవుతున్నట్లే లెక్క.

 అలాగే ప్రభుత్వం రాష్ట్రంలోని యువత నైపుణ్యాలను మదింపు చేసి వారికి అవసరమైన శిక్షణలు ఇవ్వడానికి ఉద్యోగాలు పొందగలిగే సామర్థ్యాలను పెంచడానికి అన్ని ప్రయత్నాలు తీసుకుంటూ ఉంది. నైపుణ్య పోర్టల్ ను రెండు నెలల్లోగా సిద్ధం చేయాలని లోకేష్ అధికారులను ఆదేశిస్తున్నారు.  ఈ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆటోమేటిక్గా రెజ్యూమే సిద్ధమవుతుంది. ఉద్యోగ ఉపాధి కల్పనలకు వీలుగా ఈ పోర్టల్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని లోకేష్ సూచిస్తున్నారు.

 చిన్న స్థాయి ఉద్యోగాల కల్పనలో నియోజకవర్గాలలో ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించదలచుకుంటున్న మేళాలు ఎంతో కీలకం అవుతాయని పలువురు అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క ఉద్యోగమేళా ద్వారా కనీసం 50 నుంచి 60 వరకు ఉద్యోగాలు యువతకు దక్కుతాయనేది ఒక అంచనాగా భావిస్తే గనుక..  ప్రతి విడతలో  రాష్ట్రవ్యాప్తంగా ఉండి 175 నియోజకవర్గాలలో ఇంచుమించుగా పదివేల ఉద్యోగాలు అందుతాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి వంతున ఏడాదిలో నాలుగు సార్లు మేళాలు జరుగుతాయి అనుకుంటే 40 వేల ఉద్యోగాలు యువతకు దొరుకుతాయి. ఆ రకంగా రాబోయే నాలుగు సంవత్సరాలు 1.6 లక్షల ఉద్యోగాలు కేవలం మేళాల ద్వారా మాత్రమే యువతకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఇది పెద్ద ముందడుగు అవుతుంది. అందుకే ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories