చిందులు, రంకెలు.. వీడియో రికార్డింగ్ తో బ్రేకులు!

ఏదైనా ఒక కేసులో అరెస్టు అయి రిమాండ్ లో ఉన్న నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించడం అంటే.. సాధారణంగా భయపడతారు. పోలీసు కాస్టోడియల్ విచారణలో తాము దాచదలచు కుంటున్ విషయాలు ఎక్కడ బయటకు వచ్చేస్తాయో అని ఆందోళన చెందుతారు. కానీ జగన్ కోటరీలో మహా ముఖ్యుడు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి రూటే సెపరేటు. లిక్కర్ స్కాంలో విచారించడానికి పోలీసులు తనను కస్టడీకి తీసుకుంటే, చెవిరెడ్డి వారినే భయపెట్టడానికి ప్రయత్నించారు. గట్టిగట్టిగా అరుస్తూ రంకెలు వేశారు. జైలు నుంచి బయటకు తెచ్చి పోలీసు వాహనం ఎక్కిస్తున్నప్పుడు ఎలా అయితే చిందులు తొక్కారో.. విచారణ పర్వంలో కూడా అలాగే చేశారు. అధికారులను ఒక ఎమోషనల్ డిఫెన్స్ లోకి నెట్టడానికి ప్రయత్నించారు. అయితే ఆ విచారణ పర్వం మొత్తం వీడియో రికార్డింగ్ అవుతున్నదని పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా ఆయన మెత్తబడి పోయినట్లు తెలుస్తోంది.

దేశం మొత్తం నివ్వెరపోయే స్థాయిలో వైయస్ జగన్మోహన రెడ్డి మార్గదర్శకత్వంలో ముందున్న వేలకోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పార్టీకి దండిగా నిధులు వచ్చేలా కొత్త మద్యం పాలసీ కి రూపకల్పన చేయాలని జగన్ తొలిదశలోనే గైడ్ లైన్స్ నిర్ణయించారు. వేలకోట్ల రూపాయలు స్వాహా చేయడానికి వీలుగా పాలసీ తయారు చేశారు. దాన్ని అమలులో పెట్టిన తర్వాత.. లిక్కర్ కంపెనీల నుంచి నెలవారీగా సొమ్ములు వసూలు చేసే బాధ్యతను రాజ్ కేసిరెడ్డి నెట్వర్క్ నడిపించింది. ఆయన తన మనుషులతో పోగేసిన డబ్బును ఒకచోట నిల్వ చేస్తే.. సరిగ్గా ఎన్నికల సమయానికి ఆ డబ్బు సంచులను తీసుకు వెళ్లి కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు తలా కొంచం పంచిపెట్టే పనిని, జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడుగా ఎదిగిన చెవిరెడ్డి భుజానికెత్తుకున్నారు. ఆ పాపాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.

విచారణలో రంకెలు వేస్తున్న చెవిరెడ్డి ని. పోలీసులు వీడియో ఆధారాలు కూడా చూపించి కట్టడి చేసినట్టు తెలుస్తోంది. 

లిక్కర్ కేసులోకి నిందితుడిగా చెవిరెడ్డి చాలా లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కుంభకోణం రెండో దశలో కీలక భూమిక ఆయనదే అని వార్తలు వస్తున్నాయి. గట్టిగా అరవడం vakana సాధించేదేమీ ఉండదని చెవిరెడ్డి తెలుసుకోవాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories