వీరమల్లు ట్రైలర్ పై మెగా రివ్యూ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ థియేట్రికల్ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ట్రైలర్ వచ్చి గంటలలోపే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. పవన్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్స్, బాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కలసి ట్రైలర్‌ను గ్రాండ్‌గా హైలైట్ చేశాయి. దీంతో మూవీపై అంచనాలు మిగల్చేవి కావు.

ఇప్పుడు ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించడంతో ఈ హైప్ మరింత పెరిగింది. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ —
“ఇలాంటి పవర్‌ఫుల్ ట్రైలర్ చాలా రోజుల తర్వాత చూశాను. స్క్రీన్‌పై పవన్ మళ్లీ దుమ్మురేపేలా ఉన్నాడు. సినిమాను థియేటర్‌లో చూడాలనే ఆతృత పెరిగిపోతోంది.” అని పేర్కొన్నారు.

మెగాస్టార్ ఈ విధంగా స్పందించడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పుడే ట్రైలర్‌కు ఈ స్థాయిలో స్పందన వస్తే, జూలై 24న సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ క్రియేట్ అవుతుందో అని సినీప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ఈ చిత్రాన్ని డైరెక్టర్లు క్రిష్,  జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్‌గా నిధి అగర్వాల్, అలాగే బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రూపొందించిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories