ఆ ఇద్దరి బెయిలుకు నో: రహస్యాలు తేలవలసిందే!

దేశం మొత్తం నివ్వెరపోయే స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో ఏపీలో నడిచిన మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ దందాలో కీలక నిందితులకు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. తమను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించడం కూడా పూర్తయింది గనుక.. తమకు బెయిలు ఇవ్వాలని పెట్టుకున్న పిటిషన్ ను విచారించిన హైకోర్టు చివరికి దానిని డిస్మిస్ చేసింది. అప్పట్లో సూత్రధారి మరియు అంతిమ లబ్ధిదారు అయిన జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వసనీయులైన అధికారులుగా ధనంజయ్ రెడ్డి, కృష్ణమోమన్ రెడ్డి ముద్రపడ్డారు. అందుకే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే వరకు, అంతిమ లబ్ధిదారుల గురించిన అసలు రహస్యాలు వెలుగులోకి వచ్చే వరకు వారికి బెయిలు లభించడం కూడా కష్టమే అనిపిస్తోంది.

ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అంటే.. గత అయిదేళ్ల కాలంలో దాదాపుగా డీఫాక్టో సీఎం తామే అన్నట్టుగా వ్యవహరించారు. చివరికి సీనియర్ మంత్రులు అయినా సరే.. ఏదైనా పనికోసం జగన్ వద్దకు వస్తే , వెళ్లి ఒకసారి ధనంజయ్ అన్నని కలవండన్నా.. అని జగన్ చెప్పి పంపిన సందర్భాలున్నాయి. నిజానికి సీఎం కంటె ఎక్కువగా ఈ ఇద్దరు అధికారులు ప్రభుత్వం మీద సాగించిన పెత్తనాన్ని ఆ పార్టీ సొంత నాయకులు, కార్యకర్తలే భరించలేకపోయారు. ఓటమి తర్వాత పార్టీని వీడిపోయిన ప్రతి నాయకుడు కూడా.. తమ అసంతృప్తికి కారణం.. ఇలాంటి అవతవక పాలనే అని ఈ ఇద్దరి మీద ఆరోపణలు చేసిన సంగతి కూడా అందరికీ గుర్తుంటుంది.
అలాంటిది ఈ ఇద్దరు అధికారులు.. లిక్కర్ కొత్త పాలసీ ద్వారా.. డబ్బులు ఎలా కాజేయవచ్చునో ప్లాన్ మాస్టర్ బ్రెయిన్లలో భాగం పంచుకున్నారు. పాలసీ రూపకల్పన దగ్గరినుంచి.. రాజ్ కెసిరెడ్డి తన నెట్వర్క్ ద్వారా ప్రతినెల కోట్లకు కోట్ల రూపాయలు నగదు వసూళ్లు చేసి నిల్వ చేసిన తర్వాత.. స్వయంగా తమ అధికారిక ప్రభుత్వ కార్లలోనే వచ్చి.. ఆ డబ్బు సంచులను తమ కారుల్లో నింపుకుని వాటిని తరలించి తీసుకువెళ్లడం వరకు అన్ని రకాల పాత్రలు వారు పోషించారు. లిక్కర్ కేసు విచారణ ప్రారంభం అయిన నాటినుంచి పరారీలో ఉండిపోయారు గానీ.. సుప్రీం వరకు కూడా ఎలాంటి ఊరట దక్కకపోవడంతో విచారణకు హాజరై తర్వాత అరెస్టు అయ్యారు.
మూడున్నర వేల కోట్ల రూపాయల అతిపెద్ద కుంభకోణం అది. అంతిమ లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని .. పాత్రధారులందరూ తమ వాటాలు కాజేసిన తర్వాత డబ్బులు జగన్ కే చేరాయని పోలీసులు విచారణలో తేల్చారు. అయితే.. స్వయంగా డబ్బు సంచులను జగన్ కోసం తీసుకువెళ్లిన వ్యక్తులుగా ఈ ఇద్దరు ధనంజయ్ రెడ్ది, కృష్ణమోహన్ రెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే జగన్ పాత్ర గురించి కూడా పూర్తి రహస్యాలు అధారాలతో సహా దొరికే వరకు వీరికి బెయిలు సాధ్యం కాదని పలువురు విశ్లేషిస్తున్నారు. అన్ని ఆధారాలు దొరికిన తర్వాత అసలు వీరికరి బెయిలుకు అవకాశం కూడా ఉండదని.. జగన్ తరఫున దందాను నడిపిస్తూ పాపాలు చేసినందుకు శిక్షలు అనుభవించక తప్పదని అంటున్నారు. తాజాగా కూడా వీరి బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురవడంతో ఆ విషయం స్పష్టమవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories