ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సూపర్ హీరో సీక్వెల్

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ప్రేక్షకుల దృష్టి మొత్తం ఓటిటీలపైనే కేంద్రీకృతమైంది. థియేటర్లు మూతపడ్డ సమయంలో ఎంతో మంది మంచి కంటెంట్ కోసం ఓటిటీలపై ఆధారపడిపోయారు. అప్పుడు వచ్చిన కొన్ని సినిమాలు నేరుగా ఓటిటీలో రిలీజ్ అవుతూ భారీ విజయాలను అందుకున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘ది ఓల్డ్ గార్డ్’. 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ యాక్షన్‌ డ్రామా సినిమాకి మంచి స్పందన లభించింది. ప్రత్యేకంగా సూపర్ హీరో సినిమాలను ఇష్టపడే వీక్షకులకు ఇది ఓ బిగ్ ట్రీట్‌లా మారింది.

చార్లిజ్ థెరాన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆసక్తికర కథనంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. జినా ప్రిన్స్ బైత్‌వుడ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తర్వాత, దాని కొనసాగింపుపై కూడా భారీ అంచనాలు మొదలయ్యాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ‘ది ఓల్డ్ గార్డ్ 2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇప్పటికే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2 మధ్యాహ్నం 12:30 గంటల నుండి స్ట్రీమింగ్‌కి లభ్యమవుతోంది. మొదటి భాగం ఎంత థ్రిల్‌ కలిగించిందో తెలిసినవాళ్లకు ఈ సీక్వెల్ మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి గ్రాఫిక్స్, యాక్షన్ తో కూడిన ఈ చిత్రం సూపర్ హీరో జానర్ ప్రేమికులకు ఖచ్చితంగా నచ్చుతుంది. అందరికీ అందుబాటులో ఉండేలా తెలుగులో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చింది.

ఇలాంటి కథనాలు ఇష్టపడే వారికి ఇది తప్పకుండా చూడదగ్గ చిత్రం. ఇప్పుడు ఓటిటీలోనే మునుపటి కంటే ఎక్కువ స్థాయిలో భారీ సినిమాలు వస్తున్న తరుణంలో, ఈ సీక్వెల్ మరోసారి ‘ది ఓల్డ్ గార్డ్’ మ్యాజిక్‌ని తిరిగి తెచ్చేలా కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories