పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే దర్శకుడు మారుతీతో చేస్తున్న సినిమా “ది రాజా సాబ్” నుంచి ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెంచింది. ఈ టీజర్ వచ్చిన తరువాత ఈ సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే ఇదే సమయంలో ప్రభాస్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈసారి టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడితో కలిసి పనిచేస్తున్నాడు.
ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్‌కు సంబంధించినదో లేక మరొక చిత్రానికో అనిపించే విధంగా ప్రభాస్ తాజాగా కనిపించిన ఓ లుక్ వైరల్ అవుతోంది. బాహుబలి సినిమాలకు ముందు ప్రభాస్ ఎలా కనిపించేవాడో ప్రేక్షకులందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ తరహాలో ప్రభాస్ మళ్లీ కనిపించాడంటే అభిమానులకి ఫుల్ కిక్ వచ్చింది. సాహోలో కొన్ని సన్నివేశాల్లో ఆ స్టైల్ కనిపించినప్పటికీ, ఇప్పుడిది పూర్తిగా రిఫ్రెషింగ్ గానే ఉంది.
తాజాగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోలో ప్రభాస్ చాలా స్లిమ్ గా, స్టైలిష్ గా కనిపించాడు. ఇది హను రాఘవపూడి సినిమా కోసమా లేదా మరో డైరెక్టర్ సందీప్ రెడ్డితో చేయబోయే సినిమాకు సంబంధించినదా అనేది క్లారిటీ రాలేదు. కానీ ప్రభాస్ మళ్లీ తన పాత హ్యాండ్సమ్ లుక్‌కి వెళ్లడంతో అభిమానుల్లో జోష్ మళ్లీ పెరిగిపోయింది.
ఈ ఫోటోతో మరోసారి ప్రభాస్ లుక్ డిస్కషన్ కు కారణం అయ్యాడు. ఏ సినిమా కోసమైనా ఈ లుక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు మాత్రం ఇది ఎలాంటి సినిమా కోసం అయినా పర్వాలేదు కానీ స్క్రీన్ పై ఈ లుక్‌ను చూడాలనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.