జగన్ కుటిలత్వానికి చెక్ : ఢంకా బజాయించిన బాబు!

ఒక్కో ఊర్లో కార్యక్రమం పెట్టి.. ప్రజలందరినీ అనేక నిషేధాజ్ఞల మధ్య అక్కడకు అనుమతించి.. పరదాలు కట్టుకుంటూ ఊర్లలో ప్రయాణించి.. చెట్లను నరికించి.. అంతా కలిపి బటన్లు నొక్కడం కోసం నానా బీభత్సం చేయడంమాత్రమే పాత ముఖ్యమంత్రి జగన్ కు తెలుసు. కానీ.. పెన్షన్లు ఇవ్వడాన్ని కూడా ఒక పవిత్ర యజ్ఞంగా భావిస్తూ ప్రతినెలా ఒకటోతేదీన పంక్చువల్ గా రాష్ట్రంలో ఏదో ఒక మూల పల్లెలో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి చంద్రబాబునాయుడు. జులై 1 న తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో చంద్రబాబు  పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు.  తర్వాత ప్రజావేదికలో మాట్లాడారు.

సూపర్ సిక్స్ పథకాల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చంద్రబాబునాయుడు మరోసారి పునరుద్ఘాటించారు.  ప్రతి నెలా ఒకటోతేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామాలు పండగలా కళకళలాడుతున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో డప్పు కొట్టి మరీ అభిమానుల్ని ఉత్తేజపరిచిన చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ హామీల గురించి చెప్పడం ప్రత్యర్థుల నోర్లు మూయించే ప్రయత్నమే.

సూపర్ సిక్స్ తో పాటుగా ఇచ్చిన అనేక హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కటొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నది. అయితే జగన్ మాత్రం.. ఆ హామీలన్నీ తెల్లారేసరికి అమలైపోవాలన్నట్టుగా ప్రతిసారీ అదే యాగా చేస్తూ బతుకుతున్నారు. అమలు చేసిన వాటి గురించి ఆయన మాట్లాడ్డం లేదు. ఎవైతే తర్వాతి అంచెలో అమలు చేయడానికి ప్రభుత్వం షెడ్యూలు చేసుకున్నదో వాటి గురించి యాగీ చేస్తున్నారు. సూపర్ సిక్స్ హమీల గురించి ఎవరైనా మాట్లాడితే వారికి నాలుక మందం అనుకోవాల్సిందే అంటూ ఇటీవల చంద్రబాబు వెటకారం చేసిన సంగతి కూడా తెలిసిందే. అమలు అవుతున్న వాటిని పట్టించుకోలేని జగన్ మీద ఆయన ఆరకంగా జాలి వ్యక్తం చేశారు.

నిజానికి సూపర్ సిక్స్ లో మూడు హామీలు ఆల్రెడీ అమలు అవుతూనే ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయబోతున్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రం కంటె కూడా  మిన్నగా మనం ఇక్కడ అమలు చేద్దాం అని చంద్రబాబు ఆల్రెడీ ప్రకటించారు. మిగిలిఉన్న హామీల గురించి ప్రజల్లో ఏమాత్రం అనుమానం లేదు. వారు ఓపికగానే ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు మీద నమ్మకంతోనే ఉన్నారు. కానీ ప్రజల్లో భయాలు పుట్టించడానికి జగన్ కుటిలత్వమే హద్దులు దాటుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమంలో ఢంకా బజాయించి మరీ.. సూపర్ సిక్స్ అమలుకు కట్టుబడి ఉన్నాం అని చెప్పడం విశేషం. అభిమానులు ఇచ్చిన డప్పు కొట్టడమే ఇందుకు ఉదాహరణ అని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories