హీరో నితిన్ తాజా సినిమా ‘తమ్ముడు’ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. జూలై 4న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతుండగా, దీనిపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యాక్షన్ తో పాటు కుటుంబ భావోద్వేగాలను మిళితం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కంటెంట్ పట్ల చిత్ర బృందానికి మంచి నమ్మకం ఉండటంతో, మళ్లీ ఒకసారి దిల్ రాజు మార్క్ స్ట్రాటజీ కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన కామెంట్స్ ప్రకారం, సినిమా విడుదలకు ఒకరోజు ముందే, అంటే జూలై 3న రాత్రి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్పెషల్ షోల కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్న విధానం చూస్తేనే మేకర్స్‌కి కథపై ఎంత బలమైన నమ్మకం ఉందో అర్థమవుతుంది. ఇది చూసిన అభిమానులు కూడా సినిమాపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలో నితిన్ సరసన లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ ఎమోషనల్ డ్రామాకు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ట్రైలర్‌కి మంచి థట్టు అందించారు.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్‌తో ఈ మూవీకి మంచి హైప్ ఏర్పడింది. మరి ఈ సాలిడ్ బజ్‌ను బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌గా మార్చగలిగితే నితిన్ కెరీర్లో మరో హిట్‌గా నిలవనుంది.