యూత్ ను రెచ్చగొట్టడమే జగన్ వ్యూహం!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడూ మాత్రమే పార్టీకి సంబంధించిన సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సాధారణంగా అయితే చావుల పరామర్శలు, జైళ్లలో ములాఖత్ లు  మాత్రమే ఆయన పాల్గొనే కార్యక్రమాలు. ఆ వెంటనే తాడేపల్లి ప్యాలెస్ వదలి.. బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు పారిపోతుంటారు. ఇప్పుడు అక్కడినుంచి వచ్చి.. వైసీపీ యూత్ వింగ్ తో మంగళవారం జగన్ సమావేశం కాబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ యూత్ నాయకులతో ఆయన భేటీ కాబోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు జరిగేలా యూత్ ను రెచ్చగొట్టడమే లక్ష్క్ష్యంగా జగన్ ఈ సమావేశానికి స్వయంగా హాజరవుతున్నట్టుగా ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తాడేపల్లిలోనే పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. కనీసం ఈ సమావేశానికి కూడా వైఎస్ జగన్ హాజరు కాలేదు. జగన్ తరఫున అన్నీ తానే అయి, అన్ని వ్యవహారాలను చక్కబెడుతూ ఉండే సజ్జల రామక్రిష్ణా రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ సమావేశం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామిగా ఉన్న ఎన్డీయే కూటమి రాష్ట్రంలో రాజ్యం చేస్తున్న తరుణంలో.. మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగితే.. దానికి పార్టీ అధ్యక్షుడు హాజరు కాకపోవడం పలువురిని అసంతృప్తికి గురిచేసింది.

కానీ జగన్ యువజన విభాగం సమావేశానికి మాత్రం స్వయంగా హాజరవుతున్నారు. దాని వెనుక ఎజెండా కూడా స్పష్టంగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో జగన్ నిర్వహించే ప్రతి కార్యక్రమం కూడా, పోలీసుల్ని ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడమే లక్ష్యం అన్నట్టుగా సాగుతూ పోతోంది. పోలీసులను నామ్ కే వాస్తే గా అనుమతులు అడగడం, వారు ఎలాంటి అనుమతులు ఇచ్చినా సరే.. వాటిని ధిక్కరిస్తూ ఉల్లంఘిస్తూ కార్యక్రమం నిర్వహించడం జగన్ దళాలకు పరిపాటి అయిపోయింది. పోలీసులు కఠినంగా వ్యవహరించి వైసీపీ మూకల తోపులాటలను కంట్రోల్ చేస్తే.. మా పార్టీ మీద పోలీసులు దాడులు చేస్తున్నారు అని అరుస్తారు. పోనీ.. ఆ పార్టీ వారే కదా వచ్చారు.. అని పోలీసులు మిన్నకుండి పోతే.. మా జగన్ కు రక్షణ లేకుండా చేశారు.. అని నానా గోల చేస్తారు. ఇలా వైసీపీ దళాలు రెండు నాలుకల ధోరణి అనుసరిస్తున్నాయి.

ఇలాంటి ఘటనలు ఏం జరిగినా సరే.. రాష్ట్రమంతా ఒక్కసారిగా అల్లర్లు భగ్గుమనేలా ప్లాన్ చేయడానికి , తదనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ యూత్ విభాగానికి కీ ఇచ్చి ఊరి మీదికి వదిలేయడానికే జగన్ ఈ సమావేశాన్ని స్వయంగా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జగన్ మాటలు విని ఆ పార్టీ యువ కార్యకర్తలు అనేకమంది జైళ్ల పాలవుతున్నారు. రాష్ట్రంలో అన్ని మూలలా పార్టీ కార్యకర్తలు పోలీసులు దెబ్బలు తినేలా రెచ్చగొడితే.. ఆ తర్వాత తాను పరామర్శలకు వెళ్లి.. ప్రభుత్వం మీద బురద చల్లవచ్చునని జగన్ అనుకుంటుండవచ్చునని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories