బిచ్చగాడు 3 గురించి విజయ్‌ ఏమన్నారంటే..!

తెలుగు ప్రేక్షకుల్లో బాగా గుర్తుండిపోయిన కోలీవుడ్ హిట్ చిత్రాల్లో బిచ్చగాడు ఒకటి. విజయ్ ఆంటోనీ నటించిన ఈ సినిమా మొదటి భాగం అప్పట్లో తెలుగులో ఊహించని విజయాన్ని అందుకుంది. తమిళ్ లో హిట్ అయినా, తెలుగులో ఈ సినిమా అందరికీ మరింతగా కనెక్ట్ అయ్యింది. అందుకే రెండో భాగం వచ్చేసరికి తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ ఓపెనింగ్స్ దక్కాయి. ఆ స్థాయిలో బిచ్చగాడు సిరీస్ కి మన దగ్గర ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.

ఇక తాజాగా విజయ్ ఆంటోనీ మరోసారి ఈ సిరీస్‌ను కొనసాగించబోతున్నాడు. ఇప్పటికే బిచ్చగాడు 3 ఉంటుంది అని స్వయంగా ఆయనే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తన కొత్త సినిమా మార్గన్ ప్రమోషన్‌లలో మాట్లాడినప్పుడు బిచ్చగాడు 3 రిలీజ్ డేట్‌ను కూడా స్పష్టంగా చెప్పారు. తానే దర్శకత్వం వహించనున్న ఈ మూడో భాగాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు.

విజయ్ ఆంటోనీ సైకలాజికల్ థ్రిల్లర్స్‌కి పేరుగాంచిన నటుడు. ఆయన నుంచి ఎప్పుడూ వేరే రకమైన కాన్సెప్ట్ సినిమాలు రావడం సహజం. ఇప్పుడు మార్గన్ అనే మరో థ్రిల్లింగ్ సినిమాతో జూన్ 27న థియేటర్స్ లోకి వస్తున్నాడు. ఇది కూడా ఆయన స్టైల్‌కు తగ్గట్టే ఉత్కంఠ భరితంగా ఉండబోతుందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఇక బిచ్చగాడు 3 విషయంలో మాత్రం అభిమానులు కొంతకాలం ఆగాల్సిందే. కానీ మూడో భాగంపై ఇప్పటికే ఆసక్తికరమైన బజ్ నెలకొనడం చూస్తే, అది థియేటర్స్ లో ఎలాంటి రాబడులు సాధిస్తుందో అన్న ఉత్కంఠ మొదలైపోయింది.

Related Posts

Comments

spot_img

Recent Stories