అక్కడ బ్రేక్‌ ఈవెన్‌ చేసిన కుబేర!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా “కుబేర”.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో మంచి స్పందనతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా చక్కటి కలెక్షన్లు రాబడుతోంది.

ప్రత్యేకంగా యూఎస్ బాక్సాఫీస్ విషయంలో అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో రిజల్ట్ అందుకుంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన, టికెట్ అమ్మకాల రేంజ్ చూస్తుంటే.. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఇప్పటికే తిరిగొచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా ఇక నుంచి వచ్చే మొత్తం కలెక్షన్లు లాభంగానే ఉండబోతున్నాయి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటి వెళ్లబోతున్నట్లు టాక్. శేఖర్ కమ్ముల previous సినిమాల లెక్కలతో పోలిస్తే ఇది భారీ గ్రాసర్‌గా నిలవనుందని అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా విజయం వెనక ప్రధాన కారణాల్లో ఒకటి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతమైతే మరోవైపు కథకు తగ్గట్టుగా తీర్చిదిద్దిన ఎమోషనల్ నేరేషన్ కూడా సినిమాకు బలంగా నిలిచింది.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. స్టార్స్‌కి ఉన్న క్రేజ్, దర్శకుడి టేకింగ్, టెక్నికల్ టీమ్ కృషి అన్నీ కలిసి సినిమా మంచి హిట్‌గా నిలిచింది. ఈ జట్టుకు “కుబేర” వంటి మరో విజయం చేరినట్లైంది.

Related Posts

Comments

spot_img

Recent Stories