మరో దారి లేదు…క్లాష్‌ తప్పదు!

ఈ ఏడాది టాలీవుడ్ కు సంబంధించి పరిస్థితి అంతగా మెరుగ్గా సాగలేదనే చెప్పాలి. సంక్రాంతి సీజన్ ని వదిలితే మిగతా కాలం మొత్తం బాగా నెమ్మదిగా సాగిపోయింది. ముఖ్యంగా వేసవి వరకు ప్రేక్షకులకు పెద్ద సినిమాలే తక్కువగా దక్కాయి. వాస్తవానికి హరిహర వీరమల్లు, కింగ్డమ్ లాంటి భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేయాల్సిన సమయం ఇదే కావాల్సింది. కానీ అవి వాయిదాలు పడుతూ, ఎప్పుడొస్తాయో అన్న అనుమానాలు నెలకొనిపోయాయి.

ఇక ఒకదానిపై మరో సినిమా రిలీజ్ డేట్ ఆధారపడి ఉండటం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. హరిహర వీరమల్లు ముందుగా వస్తేనే కింగ్డమ్ కి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని పరిశ్రమలో వినిపిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హరిహర వీరమల్లుని దాటి వెళ్ళకుండానే కింగ్‌డమ్ బరిలోకి దిగుతోంది. నిజానికి ముందు పవన్ కళ్యాణ్ సినిమా వస్తే, ఇతర పెద్ద సినిమాలు కనీసం కొన్ని వారాల గ్యాప్ తీసుకునేలా చూస్తుంటారు. కానీ ఈసారి కేవలం ఒకరోజు తేడాతోనే రెండు సినిమాలు థియేటర్లలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇందుకు అసలైన కారణం ఓటిటి ఒప్పందాలేనట. హరిహర వీరమల్లును అమెజాన్ ప్రైమ్Video హక్కులు తీసుకున్నట్టు సమాచారం. అలాగే కింగ్డమ్ పై నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించి రైట్స్ దక్కించుకున్నట్టు టాక్. ఈ రెండు ఓటిటిలు కూడా తమ ఒప్పందాల ప్రకారం జూలై 24, 25 తేదీల్లో సినిమా థియేటర్లలో విడుదల అవ్వాల్సిందేనని ఫిక్స్ అయిపోయాయి. అంతేకాదు ఇంతకుముందే ఈ సినిమాలు అనేకసార్లు వాయిదా పడటంతో ఇక డేట్ మార్చడానికి వీలు లేదని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో మేకర్స్ దగ్గర ఎలాంటి మరో ఆప్షన్ లేకపోవడంతో, హరిహర వీరమల్లుకు జూలై 24, కింగ్డమ్ కు జూలై 25 డేట్లు ఫైనల్ అయినట్టు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. రేపు అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇలా ఊహించని క్లాష్ ఇప్పుడు ఎలాగైనా ఎదురవ్వాల్సిందేననే నిర్ణయానికి మేకర్స్ వచ్చారని చెప్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories