విజయ్‌ సినిమా పూర్తి చేసిన పూజా!

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం చేస్తున్న చివరి సినిమా ‘జన నాయగన్’పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిజైన్ అవుతోంది. ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. షూటింగ్ ముగిసిన సంగతి స్వయంగా పూజానే తన సోషల్ మీడియాలో తెలియజేసింది. ఈ విషయాన్ని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్ మీద ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ప్రాజెక్టులో స్క్రీన్‌ పై చూపించిన కెమిస్ట్రీకి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత మేచ్యూర్డ్‌గా ఈ జోడీ స్క్రీన్ మీద కనిపించబోతుందన్న ఊహనతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ ప్రాజెక్టును కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఖర్చుతో నిర్మిస్తోంది. కథలో రాజకీయ మలుపులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయన్న సమాచారం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ద్వారా ఆయన మరికొంత హైప్ సొంతం చేసుకుంటారని నమ్మకంగా ఉన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories