పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘ది రాజాసాబ్’పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తిగా హారర్ కామెడీ నేపధ్యంలో రూపొందుతోంది. రీసెంట్గా విడుదలైన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఆ టీజర్‌ను చూస్తే ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు కనిపించాయి. ప్రభాస్ తన నటనతో ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకున్నాడు.
ఈ టీజర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో భారీగా వ్యూస్ రాబట్టింది. 24 గంటల్లోనే 59 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించటం ఇదే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఈ టీజర్ సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. దీంతో సినిమాపై అంచనాలు కొత్త స్థాయికి చేరుకున్నాయి. ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటతాడని అభిమానులు నమ్ముతున్నారు. చిత్ర బృందం కూడా అదే ఉత్సాహంతో సినిమాను ప్రమోట్ చేస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ క్లాసిక్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లాంటి హీరోయిన్లు ఈ సినిమాను మరింత రిచ్‌గా తీర్చిదిద్దుతున్నారు. బాలీవుడ్ నుండి సంజయ్ దత్ కీలక పాత్రలో నటించడం మరో విశేషం. సంగీతం థమన్ ఈ ప్రాజెక్టుకు మ్యూజిక్ అందిస్తున్నాడు. డిసెంబర్ 5న ఈ సినిమాను భారీగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.