పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజి” సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌ను యువ దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా, స్టార్‌కాస్ట్‌తో పాటు అద్భుతమైన టెక్నికల్ టీమ్ కూడా ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా మారింది.
ఈ సినిమాలో అర్జున్ దాస్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో ఆయన వాయిస్ ఓవర్ వినిపించి, ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చింది. తాజాగా అర్జున్ దాస్, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం స్పష్టంగా కనిపించింది.
అవే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ షూటింగ్ లుక్‌లో కనిపించడంతో పాటు, ఆప్యాయతగా కనిపించిన అర్జున్ దాస్‌తో ఉన్న స్నాప్స్ అభిమానుల మనసులు దోచుకుంటున్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల జరిగిన ప్రతి అప్డేట్తో సినిమా పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఓ మాస్ యాక్షన్ డ్రామా ఎలా ఉండాలో అలా తయారవుతోందని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రంతో పవన్ మరోసారి తన మార్క్ మాస్ అవతారాన్ని చూపించనున్నాడు.