ఆ ఓటీటీలోకి సర్‌ప్రైజ్‌ గా వచ్చేసిన సింగిల్‌!

టాలీవుడ్‌లో యూత్‌ని ఎట్రాక్ట్ చేసిన తాజా ఎంటర్టైనర్‌ “సింగిల్” ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. శ్రీవిష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్‌ రిలీజ్ టైమ్‌లోనే మంచి స్పందన తెచ్చుకుంది. ఫుల్ ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు యూత్‌ను కనెక్ట్ చేసే ఎమోషన్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.

దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్‌లో ఒక మిలestone లాంటి సినిమా అయింది. మంచి హిట్ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద కూడా బాగానే రన్ అయింది. థియేటర్‌లో విజయవంతంగా నడిచిన తర్వాత ఈ సినిమా ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమా తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అంటే ఇతర భాషల్లో కూడా చూసే వీలుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి, యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండటంతో మళ్లీ ఓసారి సినిమా చూసేలా చేస్తోంది.

ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి మంచి వ్యూస్‌తో ముందుకు వెళుతోంది. మంచి ఫీల్ గుడ్ సినిమాల్ని ఇష్టపడే వారు ఈ సినిమా ఓసారి ఖచ్చితంగా చూడొచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories