అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోల్లో అఖిల్ అక్కినేని ఒకరు. ఈ మధ్యకాలంలో అఖిల్ ‘లెనిన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల అఖిల్ సోదరుడు నాగ చైతన్యకు కొంతకాలం క్రితం పెళ్లి అయ్యింది.అప్పటి నుంచి అఖిల్ పెళ్లి గురించి కూడా చర్చలు మొదలయ్యాయి.
తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, అఖిల్ పెళ్లి విషయమై డేట్ లాక్ అయిందని చెప్పుకుంటున్నారు. జైనబ్ అనే అమ్మాయిని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్. వీరి వివాహం జూన్ నెల 6వ తేదీన జరగనుందని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు, అందుకే అభిమానులు ఇంకా క్లారిటీ కోసం వేచిచూస్తున్నారు.
ఇక అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ షూటింగ్ ప్రస్తుతం భారీ సెట్స్ లో శరవేగంగా జరుగుతోంది. మూవీ యూనిట్ నుంచి వచ్చే వార్తల ప్రకారం, ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టనున్న అఖిల్, మరోవైపు తన కెరీర్ లో కూడా హిట్ అందుకోవాలని కృషి చేస్తున్నాడు.