మాస్ రాజా రవితేజ ఇప్పుడు ఒక కొత్త సినిమా ‘మాస్ జాతర’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది భాను బోగవరపు. కథ మొత్తంగా చూస్తే ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించబోతుంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్లు, పోస్టర్లు ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేపాయి.
అసలు ఈ సినిమాను మేకర్స్ మొదట మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆ డేట్ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, మూవీ టీమ్ ఇప్పుడు ఆగస్టు 27న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రవితేజ ఈ సినిమాలో తన మాస్ స్టయిల్‌తో మరోసారి ప్రేక్షకులను రంజింపచేయబోతున్నారని చెబుతున్నారు. హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటం మరింత ఆసక్తి కలిగిస్తోంది. అయితే, ఈ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఇక రవితేజ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఉత్సాహం అంతా ఇంతా కాదు. విడుదలైనప్పటి నుంచి మాస్ జాతర ఎంత రచ్చ చేస్తుందో చూడాలి.