బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ చిత్రంతో డిజాస్టర్‌ను మూటకట్టుకున్నాడు. ఆ సినిమాతో ఆయన తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయితే, కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు ఓ సడెన్ సర్‌ప్రైజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరో ధనుష్‌తో కలిసి ఆయన ఓ సెన్సేషనల్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.
భారత మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలామ్ బయోపిక్‌ను ‘కలామ్’ పేరుతో రూపొందిస్తున్నట్లు ఓం రౌత్ ప్రకటించాడు. తాజాగా దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘కలామ్ – ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.