పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం మరో పెద్ద సినిమాకు రెడీ అవుతున్నారు. ఈసారి ఆయన దర్శకుడు అట్లీతో కలిసి ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే ముందు బన్నీ కొన్నిపనులు పూర్తి చేసేందుకు ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఆయన త్వరలోనే అమెరికా వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అక్కడ జరిగే నాట్స్ అనే భారీ తెలుగు ఈవెంట్‌లో బన్నీ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. అమెరికాలో తెలుగు వారిలో ప్రత్యేక స్థానం పొందిన ఈ వేడుకలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారే జరుగుతాయి. ఈ ఏడాది జులై 4 నుంచి 6 వరకు ఫ్లోరిడాలోని టాంపా నగరంలో ఈ కార్యక్రమం జరగనుంది.
బన్నీ వస్తున్నారని తెలుసుకున్న తెలుగు ప్రవాస భారతీయుల్లో ఎనలేని ఉత్సాహం నెలకొంది. అల్లు అర్జున్ హాజరవడం వల్ల ఈ వేడుకలకు మరింత గ్రాండుగా జరుగుతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. సాధారణంగా సినిమాల్లో బన్నీని తెరపై చూడడం అలవాటు అయిన అభిమానులు, ఇప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా చూడనున్నామని ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు.