టాలీవుడ్‌లో ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతూ రూపొందుతున్న తాజా మల్టీస్టారర్ సినిమా భైరవం మంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముగ్గురు హీరోలు కలిసి నటించడమే కాకుండా, పాత్రలు కూడా పవర్‌ఫుల్‌గా ఉండేలా డిజైన్ చేశారని తెలుస్తోంది.
ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా తాజాగా విడుదలైన గజపతి థీమ్ మ్యూజిక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్య సంగీతం మనోజ్ పాత్ర గజపతికి ప్రత్యేకమైన ఎలివేషన్ ఇచ్చేలా ఉంటుంది. గంభీరమైన స్కోర్‌తో పాటు విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. ఇక గజపతి పాత్ర ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం సినిమాకు కీలకంగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.