ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కొన్ని సినిమాల అప్‌డేట్స్ గురించి ఓసారి చూద్దాం. శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ థియేటర్లలో మంచి రీస్పాన్స్ అందుకుంటోంది. విడుదలకి ముందే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడటంతో, మొదటి షో నుంచే హిట్ టాక్ తో దూసుకెళ్లింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కోసం కొనుగోలు చేసింది. రిలీజ్ అయి నాలుగు వారాలు పూర్తయిన తర్వాత అంటే జూన్ 6 లేక 12వ తేదీన ప్రేక్షకులకు ఓటీటీ ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపిస్తుండగా, సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందించారు. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు డైరెక్ట్ చేశారు.