టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఓ మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి హీరోయిన్ ఎవరు అనే విషయం మీద ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా, ఇప్పుడు ఈ మిస్టరీకి ఒక క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో వీడియోలో స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమాలో నాయికగా కనిపించనుందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పూర్తిగా సరదాగా, ఫన్‌గా ఉన్న ఆ స్పెషల్ వీడియోలో నయనతారను ప్రాజెక్ట్‌కి స్వాగతం పలికారు. దీనితో ఆమె ఈ సినిమాకి ఫిక్స్ అయినట్టు కన్ఫర్మ్ అయిపోయింది.
ఈ సినిమాకు సంగీతం అందించనున్నది భీమ్స్ సిసిరోహ్యో. అన్నీ బాగానే జరుగితే వచ్చే సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా విడుదల కావొచ్చని టాక్. ఇక ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్న సంస్థ షైన్ స్క్రీన్స్ కావడం గమనించాల్సిన విషయం.
చిరంజీవి–అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్‌పై అభిమానుల్లో మంచి బజ్ ఉంది. ఇక నయనతార ఎంట్రీతో ఆ ఆసక్తి మరింత పెరిగేలా ఉంది.