చరణ్‌ సినిమాకి షాకింగ్‌ టీఆర్పీ!

రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి నటించిన చిత్రం “గేమ్ ఛేంజర్”, ఇది దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా. అయితే, ఈ చిత్రానికి అనుకున్న అంచనాలు సాధించలేదు అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఓటిటి వేదికపై అందరి దృష్టిని ఆకర్షించిన తర్వాత, టెలివిజన్ పై కూడా ప్రసారం అయింది.

ఇప్పుడే ఈ సినిమా టెలివిజన్ పై ప్రసారం అవ్వడంతో అందుకున్న టీఆర్పీ రేటింగ్ కూడా వెలుగులోకి వచ్చింది. మొదటి ప్రసారం జరిగిన సమయంలో “గేమ్ ఛేంజర్” 5.02 టీఆర్పీ రేటింగ్ ని నమోదు చేసింది. ఇది కొంచెం తక్కువగా కనిపించవచ్చు, కానీ గతంలో విడుదలైన పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఇలాంటి రేటింగ్స్ సాధించాయి. ఉదాహరణకి, “సలార్” మరియు “కల్కి 2898” వంటి విజయవంతమైన సినిమాలు కూడా సమానమైన రేటింగ్స్ ను పొందాయి. కాబట్టి, ఈ రేటింగ్ ను పరిశీలిస్తే, “గేమ్ ఛేంజర్” చిన్న తెరపై మంచి ఫలితమే సాధించిందని చెప్పవచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories